భారీ నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు

28 Feb, 2018 09:29 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీనష్టాలతో ప్రారంభమయ్యాయి.ప్రధానంగా పీఎస్‌యూ బ్యాంకింగ్‌లో వరుస అమ్మకాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రస్తుతం సెన్సెక్స్‌ 252 పాయింట్లు కోల్పోయి 34,091వద్ద, నిఫ్టీ 85 పాయింట్ల పతనమై 10,469 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లోనే ఉన్నాయి. ముఖ్యంగా బ్యాంక్‌ నిఫ్టీకి బుధవారం (350 పాయింట్లు నష్టం) బిగ్‌ బ్యాడ్‌ డేగా  చెప్పొచ్చు. పీఎన్‌బీ స్కాంలో​ నేపథ్యంలో  బుధవారం కూడా భారీగా నష్టపోతోంది.  ఐడీబీఐ, హెచ్‌పీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కెనరా, ఐసీఐసీఐ  సహా ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకు షేర్లను అమ్మకాల సెగ తాకింది. హెచ్‌సీఎల్‌ టెక్‌, సిప్లా , ఐడియా తప్ప అన్ని షేర్లు నష్టాల్లో కొనసాగుతుండటం గమనార్హం
 

మరిన్ని వార్తలు