కశ్మీర్‌ ఎఫెక్ట్‌ : మార్కెట్లు పతనం

5 Aug, 2019 15:29 IST|Sakshi

సాక్షి, ముంబై:  జాతీయ, అంతర్జాతీయ అంశాలుస్టాక్‌మార్కెట్లో ప్రకంపనలు  రేపాయి. ఒకవైపు వాణిజ్య వివాదాలూ, కశ్మీర్‌ స్వయం ప్రతిపత్తిని తొలగిస్తూ ఆర్గికల్‌ 370, 35ఏ రద్దు  నిర్ణఁఃతో దేశీ స్టాక్‌మార్కెట్లు  భారీ పతనాన్ని నమదు చేశాయి.  ఇన్వెస్టర్లు అమ్మకాలతో  సెన్సెక్స్‌ 418 పాయింట్లు పతనమై నిఫ్టీ 135 పాయింట్లు నష్టాలతో ముగిసింది.

అన్ని రంగాలూ  నష్టాల్లోనే ముగిశాయి.   ఒక్క ఐటీ  తప్ప  ప్రధానంగా పీఎస్‌యూ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌, మీడియా, రియల్టీ, మెటల్‌, ఆటో  నష్టాల్లో ముగిసాయి.   బ్యాంక్‌ నిఫ్టీలో యస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, బీవోబీ, ఐసీఐసీఐ, ఐడీఎఫ్‌సీ ఫస్ట్‌ బ్యాంక్‌, కొటక్ మహీంద్రా, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ  కుదేలయ్యాయి. ఇతర నిఫ్టీ దిగ్గజాలలో టాటా మోటార్స్‌, పవర్‌గ్రిడ్‌, ఆర్‌ఐఎల్‌, టాటా స్టీల్‌, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఇన్‌ఫ్రాటెల్‌ కోల్‌ ఇండియా, టీసీఎస్‌, బజాజ్‌ ఆటో, సిప్లా, హీరో మోటో, హెచ్‌యూఎల్‌ నష్టపోయాయి.

అటు డాలరు మారకంలో రూపాయి బాగా బలహీనపడింది.  డాలరు పుంజుకోవడతో  ఏకంగా 92పైసలు కుప్పకూలి 70.51 స్థాయికి చేరుకుంది. శుక్రవారం 69.59 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. 

మరిన్ని వార్తలు