నష‍్టాల ముగింపు : 11500 దిగువకు  నిఫ్టీ 

10 Jul, 2019 16:23 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలతోనే ముగిశాయి. రోజంతా ఒడిదుడుకుల మధ్య కొనసాగిన సూచీలు చివరకి భారీ నష్టాలనే మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్‌ 174 పాయింట్లు క్షీణించి 38 557 వద్ద, నిఫ్టీ 57 పాయింట్లు పతనమై 11498 వద్ద ముగిసింది. తద్వారా 11500 దిగువ ముగిసి  నిఫ్టీ మరింత బలహీన సం​కేతాలను అందించింది. యస్‌బ్యాంకు, కోల్‌ ఇండియా, సన్‌ఫార‍్మ,కోటక్‌ మహీంద్ర, ఐసీఐసీఐ, హెచ్‌డీఎఫ్‌సీ టాప్‌విన‍్నర్స్‌గా ఉన్నాయి.  బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, టాటా స్టీల్‌, యాక్సిస్‌బ్యాంకు, ఎల్‌ అండ్టీ, హీరో మోటో,  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.  అలాగే    క్యూ1లో బలహీన ఫలితాలతో  టీసీఎస్‌, ప్రమోటర్ల మధ్య విభేదాలు రచ్చకోక్కడంతో ఇండిగో  షేర్లు నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు