ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

22 Feb, 2019 09:27 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు స‍్వల్ప నష్టాలతో బలహీనంగా ప్రారంభమైంది.  సెన్సెక్స్‌ 43 పాయింట్లు క్షీణించి 35849 వద్ద, నిఫ్టీ 20 పాయింట్లు బలహీన పడి 10773 వద్ద ట్రేడ్‌ అవుతోంది.  గురువారం  బాగా లాభపడిన బ్యాంకింగ్‌ సెక్టార్‌లో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. ముత్తూట్‌ ఫైన్సాన్స్‌, మారుతి సుజుకి, టెక్‌ మహీంద్ర తోపాటు ఇన్‌ఫ్రా షేర్లు టాప్‌ వినర్స్‌గా ఉన్నాయి. కోటక్‌, ఇండస్‌ ఇండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ,  ఐడీబీఐ బ్యాంకు , డిష్‌టీవీ  తదితరాలు నష్టపోతున్నాయి. 

అటు డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రుపీ కూడా ఫ్లాట్‌గా కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు