ఫెడ్ ఎఫెక్ట్ : లాభాలకు చెక్

11 Jun, 2020 09:50 IST|Sakshi

సాక్షి, ముంబై:  అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. ఫెడ్ నిర్ణయతో కీలక సూచీలు మూడు రోజుల లాభాలకు చెక్ చెప్పాయి. ఒక దశలో రెండు వందల పాయింట్లను కోల్పోయిన సెన్సెక్స్ ప్రస్తుతం 170 పాయింట్ల నష్టంతో 34060 వద్ద, నిఫ్టీ 53 పాయింట్ల నష్టంతో 10063 వద్ద కొనసాగుతున్నాయి.  ఊగిసలాట ధోరణి  కనిపిస్తోంది.

బ్యాంకింగ్,  ఐటీ, ఫార్మా షేర్లు ప్రధానంగా నష్టపోతున్నాయి. డాలరు బలహీనత నేపథ్యంలో  ఐటీ షేర్లలో అమ్మకాలు ధోరణి నెలకొంది.  సన్ ఫార్మ, గెయిల్, టాటా మోటార్స్,  భారతి ఇన్ ఫ్రాటెల్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా స్టీల్, హిందాల్కో భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు టెలికాం కంపెనీల సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్ ) వివాదంలో సుప్రీంకోర్టు ఈ రోజు విచారించనుంది. అటు ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్లను యథాతథంగా సున్నా స్థాయిలోనే కొనసాగించేందుకు నిర్ణయించినసంగతి తెలిసిందే.

చదవండి : పెట్రో వడ్డింపు : ఎంత పెరిగిందంటే
నకిలీ నోట్ల రాకెట్ : షాకైన పోలీసులు

మరిన్ని వార్తలు