రుచించని రివ్యూ, బ్యాంకు షేర్లు ఢమాల్‌

7 Aug, 2019 15:18 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ నష్టాల్లో  కొనసాగుతున్నాయి. ప్రధానంగా  రిజర్వ్‌ బ్యాంక్‌ పాలసీ సమీక్ష నేపథ్యంలో ఫ్లాట్‌గా ప్రారంభమైన దేశీ స్టాక్‌మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 304 పాయింట్లు క్షీణించి 36,675 కు చేరగా, నిఫ్టీ సైతం 93 పాయింట్లు నీరసించి 10,854 వద్ద ట్రేడవుతోంది.  బ్యాంకు నిష్టీ 350  నష్టపోయింది. 

ప్రధానంగా  బ్యాంకు నిఫ్టీ,  మెటల్‌ , ఆటో నష్టపోతుండగా, మీడియా, ఫార్మా ఐటీ  లాభపడుతున్నాయి. యాక్సిస్‌, ఎస్‌బీఐ, బ్యాంకు ఆఫ్‌ బరోడా, ఐబీ హౌసింగ్, టాటా స్టీల్‌, బీపీసీఎల్‌, ఎంఅండ్‌ఎం, గెయిల్‌, ఐషర్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, గ్రాసిమ్‌, అదానీ పోర్ట్స్‌, ఐవోసీ నష్టపోతున్నాయి. జీ, ఇండస్‌ఇండ్‌, సిప్లా, హెచ్‌యూఎల్‌, హీరో మోటో, హెచ్‌సీఎల్‌ టెక్, ఐసీఐసీఐ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌  లాభపడుతున్నాయి. 

కాగా ఆర్‌బీఐవరుసగా నాలుగోసారి రెపో రేటు కోత పెట్టిన సంగతి తెలిసిందే. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 5.4 శాతానికి దిగివచ్చింది. మరోవైపు డాలరుతో మారకంలో రూపాయి 71 స్థాయికి బలహీనపడింది

మరిన్ని వార్తలు