నష్టాల్లో స్టాక్‌మార్కెట్లు, 11 వేల దిగువకు నిఫ్టీ

16 Aug, 2019 09:28 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి.  ఒక అడుగు ముందుకు, రెండు అడుగులు వెనక్కి అన‍్నట్టుగా సూచీలు కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో   సెన్సెక్స్‌ 260 పాయింట్ల నష్టపోగా నిఫ్టీ 80 పాయింట్లు  బలహీనపడింది. తద్వారా నిఫ్టీ 11వేల దిగువకు చేరింది. దాదాపు అన్ని రంగాలు నష్టపోతున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌,  ఆటో,  ఫార్మ , ఐటీ నష్టపోతున్నాయి. ఇండియా బుల్స్‌, వేదాంతా,  టాటాస్టీల్‌, మారుతి, టాటా మోటార్స్‌, హీరోమోటో, హెచ్‌సీఎల్‌ టెక్‌, విప్రో, డిష్‌టీవీ,ఎస్‌బీఐ, ఇండస్‌ఇండ్‌, కోటక్‌ మహీంద్ర, గ్లెన్‌మార్క్‌, సన్‌ఫార్మ నష్టపోతున్నాయి. యస్‌బ్యాంకు 3 శాతం ఎగిసింది.    

మరిన్ని వార్తలు