రేట్‌ కట్‌ అంచనా : లాభాల ముగింపు

6 Aug, 2019 15:40 IST|Sakshi

లాభాల్లో ముగిసిన స్టాక్‌మార్కెట్లు 

సాక్షి, ముంబై : భారీ ఒడిదుడుకుల మధ్య సాగిన దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి లాభాల్లోనే ముగిశాయి. ఆరంభం లాభాలనుంచి మరింత ఎగిసి మార్కెట్లు ఒక దశలో 500 పాయింట్లకుపైగా పుంజుకున్నాయి. అయితే ఆఖరి గంటలో ఇన్వెస‍్టర్ల అప్రమత్తతతో సెన్సెక్స్‌ 227 పాయింట్లు, నిఫ్టీ 86 పాయింట్ల లాభాలకు  సరిపెట్టుకున్నాయి.  ప్రాఫిట్‌ బుకింగ్‌కు తోడు, ఆర్‌బీఐ మరోసారి పావుశాతం మేర కీలక వడ్డీరేటు కోత పెట్టనుందన్న  అంచనాలు  ఇన్వెస్టర్ల సెంటిమెం‍టును బలపర్చినట్టు మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  ఇప్పటికే  ప్రారంభమైన మానిటరీ పాలసీ రివ్యూ సమావేశం రేపు (బుధవారం) తన నిర్ణయాన్ని వెలువరించనుంది. 

మీడియా తప్ప దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. ముఖ్యంగా  పీఎస్‌యూ బ్యాంక్‌ లాభాలు మార్కెట్లను లీడ్‌ చేశాయి. ఎస్‌బ్యాంకు, హెచ్‌డీఎఫ్‌సీ, పీఎన్‌బీ, యాక్సిస్‌, సిండికేట్‌,  ఐసీఐసీఐ బ్యాంకు, కోటక్‌, ఇలా అన్ని బ్యాంకు షేర్లు లాభాల్లో ముగిసాయి.  మారుతి సుజుకి, అదానీ పోర్ట్స్‌,  ఎల్‌ అండ్‌టీ,  కోల్‌ ఇండియా,  ఏషియన​ పెయిం‍ట్స్‌, ఇండియా బుల్స్‌, టెక్‌ మహీంద్ర, ఐషర్‌ మోటార్స్‌, బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, హిందాల్కో, భారతి ఎయిర్‌టెల్‌ టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, రిలయన్స్‌, ఐటీసీ, టాటా స్టీల్‌, వేదాంత జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ నష్టపోయాయి.  

మరిన్ని వార్తలు