మెటల్‌, రిలయన్స్‌ అండ : కోలుకున్న మార్కెట్‌

15 May, 2020 15:58 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్‌  మార్కెట్లు  భారీగా కోలుకుని  ఫ్లాట్‌గా ముగిసాయి. ఆరంభంలో 200 పాయింట్లకు పైగా కోల్పోయిన మార్కెట్లో రోజంతా  తీవ్రంగా ఊగిసలాట ధోరణి కొనసాగింది. చివరికి సెన్సెక్స్‌   25   పాయింట్లు    నష్టంతో  31097 వద్ద, నిఫ్టీ  6 పాయింట్లు కోల్పోయి  9136 వద్ద ముగిసింది. తద్వారా కీలక సూచీలురెండూ  ప్రధాన మద్దతు  స్థాయిలకు ఎగువన ముగిసాయి. మెటల్‌ మినహా దాదాపు అన్ని రంగాల షేర్లు  నష‍్టపోయాయి. (లాక్‌డౌన్ పొడగింపు : 200 పాయింట్లు పతనం  )

అయితే  మిడ్‌ సెషన్‌ తరువాత నుంచి రిలయన్స్‌, భారతి ఎయిర్‌టెల్‌ కొనుగోళ్లతో మార్కట్‌ నష్టాల నుంచి  కోలుకుంది.    దాదాపు బ్యాంకింగ్‌ రంగ షేర్లన్నీ నష్టాల్లో ముగిసాయి. ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ,యాక్సిస్‌, ఫెడరల్‌,  కెనరా బ్యాంకు,  సన్‌ ఫార్మ,  ఎం అండ్‌ ఎం, హీరో మోటో, బజాజ్‌ ఆటో,  భారతి ఇన్‌ఫఫ్రాటెల్‌  టాప్‌  లూజర్స్‌గా ఉన్నాయి.  మరోవైపు వేదాంతా, బీపీసీఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌, జేఎస్‌డబ్ల్యూస్టీల్‌, టాటాస్టీల్‌, బ్రిటానియా, హిందాల్కో, ఓఎన్‌జీసీ  లాభపడ్డా​యి.

మరిన్ని వార్తలు