ఫెడ్‌ షాక్‌: భారీ నష్టాలు

1 Aug, 2019 15:37 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లకు ఫెడ్‌ షాక్‌ తగిలింది. 2008 తరువాత తొలిసారిగా అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ పావు శాతం వడ్డీకోతకు నిర్ణయించడంతో అంతర్జాతీయ స్టాక్‌మార్కెట్లు కుదేలయ్యాయి. డాలరు బాగా బలపడింది. ఈ ప్రభావం మన మార్కెట్లపైనా భారీగా పడింది. ఒక దశలో 760 పాయింట్లకుపైగా పతనమైన సూచీ ఆఖరి గంటలో  వీ షేప్‌లో మళ్లీ రికవరీ అయింది. అయితే నిఫ్టీ 11వేల దిగువనే ముగిసింది. సెన్సెక్స్‌ 463 పాయింట్లు పతనమై 37018 వద్ద, నిఫ్టీ 138 పాయింట్ల నష్టంతో 10980 వద్ద ముగిసాయి.  దాదాపు అన్ని రంగాలు నష్టపోయాయి.  

జీ టాప్‌ లూజర్‌గా నిలిచింది. వీటితోపాటు వేదాంతా,జేఎస్‌డబ్ల్యూ, ఎస్‌బీఐ,  టాటా మోటార్స్‌, భారతి  ఎయిర్‌ఠెల్‌, ఇన్ఫోసిస్‌ నష్టపోయాయి. మరోవైపు జూలై ఆటోసేల్స్‌ మందగించినప్పటికీ ఆటో షేర్లు లాభపడ్డాయి. ముఖ్యంగా మారుతి టాప్‌విన్నర్‌గా ఉంది.  ఇంకా  పవర్‌గ్రిడ్‌, రిలయన్స్‌,  బజాజ్‌ఆటో, హీరోమోటో కార్ప్‌,  హెచ్‌యూఎల్‌, ఐషర్‌ మోటార్స్‌  లాభపడ్డాయి. 
 

మరిన్ని వార్తలు