లాభాల స్వీకరణ: 200పాయింట్లు పతనం

4 Jun, 2019 15:22 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు  గరిష్ట స్థాయిలనుంచి వెనక్కితగ్గాయి. ఆరంభంనుంచి   ప్రతికూలంగా   ట్రేడ్‌ అయిన కీలక సూచీలు  చివరివరకూ అదే బాటలో సాగాయి. చివరికి సెన్సెక్స్‌ 184  పాయింట్లు పతనమై 40083 వద్ద  నిఫ్టీ  67 పాయింట్లు క్షీణించి 12021 వద్ద ముగిసింది. రికార్డు స్థాయిల వద్ద లాభాల స్వీకరణతో ప్రభుత్వ రంగ బ్యాంకులు తప్ప దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాలు కనిపించాయి. 

ప్రపంచ ఆర్థిక వృద్ధిపై ఆందోళనలతో అంతర్జాతీయంగా సెంటిమెంటు బలహీనపడటంతో అమెరికా స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు సోమవారం నష్టపోయాయి.మరోవైపు కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటు కావడంతో విదేశీ సంకేతాలు బలహీనంగా ఉన్నప్పటికీ అంతర్గతంగా సెంటిమెంటు బలంగానే ఉన్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

పీఎస్‌యూ బ్యాంక్స్‌  పుంజుకోగా, ఐటీ, ఫార్మా డీలాపడ్డాయి.  ఎన్‌టీపీసీ, విప్రో, టీసీఎస్‌, ఇన్ఫీ, యస్‌ బ్యాంక్‌, ఇన్‌ఫ్రాటెల్‌, వేదాంతా, బజాజ్ ఫైనాన్స్, కోల్‌ ఇండియా, ఐటీసీ, ఐషర్‌, యూపీఎల్‌ టాప్‌ విన్నర్స్‌గా నిలిచాయి. అయితే  జీ, హీరోమోటో, ఏషియన్‌ పెయింట్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐవోసీ, హెచ్‌యూఎల్‌, బజాజ్‌ ఆటో, అదానీ పోర్ట్స్‌, టైటన్‌, బీపీసీఎల్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు