బ్యాంక్స్‌ జోష్‌, చివరికి లాభాలే

11 Nov, 2019 15:51 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌గా ముగిసాయి. ఆరంభ నష్టాలతో రోజంతా  ఊగిసలాట మధ్య కొనసాగిన సూచీలు చివరికి స్వల్ప లాభాలతో స్థిరంగా ముగిసాయి. ముఖ్యంగా చివరి అర్థగంటలో కొనుగోళ్లు  పుంజుకోవడంతో సెన్సెక్స్‌ 21 పాయింట్లుఎగిసి 40345 వద్ద, నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 11913 వద్ద ఫ్లాట్‌గా ముగిసాయి. దీంతో కీలక సూచీలు రెండూ  ప్రధాన మద్దతుస్థాయిలను నిలబెట్టుకున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్ల లాభాలు మార్కెట్లను నిలబెట్టాయి. ఐటీ, ఆటో నష్టపోయాయి. జీ, యస్‌ బ్యాంకు, బీపీసీఎల్‌, గెయిల్‌,టాటా మోటార్స్‌, ఐవోసీ, యాక్సిస్‌, కోటక్‌ మహీంద్ర, భారతి ఇన్‌ఫ్రాటెల్‌ టాప్‌ గెయినర్స్‌గా  నిలిచాయి.  మరోవైపు  నెస్లే, హీరో మోటో, హిందాల్కో, వేదాంతా, సిప్లా, ఐషర్‌ మెటార్స్‌, టీసీఎస్‌, యూపిఎల్‌, బ్రిటానియా,రిలయన్స్‌  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు