ఐటీ దన్ను : లాభాల జోరు

26 Jun, 2020 15:47 IST|Sakshi

35150 ఎగువకు  సెన్సెక్స్ 

10350 పైన ముగిసిన నిఫ్టీ 

వరుసగా  4వ వారం లాభాల ముగింపు

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిసాయి. రెండు రోజుల నష్టాలకు చెక్ చెప్పిన సూచీలు జూలై డెరివేటివ్‌ సిరీస్‌ను శుభారంభాన్నిచ్చాయి. చివరి గంటలో మరింత పుంజుకుని వారాంతంలో హుషారుగా క్లోజ్ అయ్యాయి.  సెన్సెక్స్ 329 పాయింట్లు ఎగిసి 35171 వద్ద, నిఫ్టీ 94 పాయింట్ల లాభంతో 10383 వద్ద స్థిరంగా ముగిసాయి. దాదాపు అన్ని రంగాలు లాభాల నార్జించాయి.  మెటల్, పీఎస్‌యు బ్యాంక్ ఇండెక్స్ లాభపడ్డాయి.  ముఖ్యంగా ఐటీ లాభాలు మార్కెట్ కు మద్దతునిచ్చాయి. ఊహించిన దానికంటే యాక్సెంచర్ ప్రకటించిన మెరుగైన త్రైమాసిక ఫలితాలతో టెక్నాలజీ (ఐటి) కంపెనీల షేర్లు ర్యాలీగా అయ్యాయి.

ఇన్ఫోసిస్ టాప్ విన్నర్ గా ఉండగా,  భారత్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్, రిలయన్స్, టీసీఎస్, విప్రో, జీ, ఒఎన్జీసీ, హెచ్సిఎల్ టెక్నాలజీస్, టెక్ మహీంద్ర,  బజాజ్ ఆటో, మైండ్‌ట్రీ, మాస్టెక్, ఎన్‌ఐఐటి టెక్ లాభపడ్డాయి. మరోవైపు  కోటక్ మహీంద్రా బ్యాంక్, భారతి ఇన్‌ఫ్రాటెల్, ఐటిసి, బజాజ్ ఫైనాన్స్, హిందుస్తాన్ యూనిలీవర్, సన్ ఫార్మా, బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ  నష్టపోయాయి. 

మరిన్ని వార్తలు