లాభాలతో సెప్టెంబరు సిరీస్‌ శుభారంభం

30 Aug, 2019 15:47 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ  స్టాక్‌మార్కెట్లు  భారీ లాభాలతో ముగిసాయి.  రోజంతా లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాటకు లోనైనా వారాంతంలో పాజిటివ్‌ ముగింపునిచ్చాయి.  తొలుత 250 పాయింట్లు ఎగసిన  మళ్లీ అదే స్థాయిలో  నష్టా‍ల్లోకి జారుకుంది.   మిడ్‌ సెషన్‌తరువాత  భారీగా పుంజుకుని 300 పాయింట్లకు పైగా ఎగిసిసంది. చివరికి భారీ లాభాలతో  ముగియడం విశేషం. సెన్సెక్స్‌ 264 పాయింట్ల లాభంతో  37332 వద్ద ,  నిఫ్టీ 75 పాయింట్లు  లాభంతో 11023  వద్ద ముగిసింది.  ఇన్‌ఫ్రా, ఎనర్జీ తప్ప  దాదాపు అన్ని రంగాలు లాభపడ్డాయి. 

ప్రధానంగా పీఎస్‌యూ , బ్యాంక్స్‌ ఆటో మెటల్‌, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ రంగ లాభాలు మార్కెట్‌కు బలాన్నిచ్చాయి.  యస్‌బ్యాంకు, సన్‌ఫార్మ, ఇండస్‌ఇండ్‌, హెచ్‌యూఎల్‌, టాటా స్టీల్‌ వేదాంతా, టాటా మోటార్స్‌ , ఐటీసీ, ఐసీఐసీఐ, బజాజ్‌ ఆటో,  బజాజ్‌ ఫినాన్స్‌, టీసీఎస్‌ లాభపడ్డాయి. మరోవైపు   భారతి ఇన్‌ఫ్రాటెల్‌,  పవర్‌గ్రిడ్‌, ఇన్‌ఫ్రాటెల్‌, కోల్‌ ఇండియా, ఐషర్‌ మోటార్స్‌, ఓన్‌జీసీ, కోటక్‌ మహీంద్ర బ్యాంకు, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఎల్‌అండ్‌టీ, యాక్సిస్‌, ఐవోసీ, బీపీసీఎల్‌ నష్టపోయాయి. 
 

మరిన్ని వార్తలు