ఫ్లాట్‌గా ముగిసిన మార్కెట్లు

29 Nov, 2017 16:03 IST|Sakshi


సాక్షి, ముంబై: దేశీయ  స్టాక్‌ మార్కెట్లు    స్వల్ప నష్టాలతో  ఫ్లాట్‌గాముగిశాయి.  ఒడిదుడుకుల మధ్య లాభనష్టాలతో ఊగిస లాడిన మార్కెట్లలో చివరి గంటన్నరలో అమ్మకాలు భారీగా నెలకొన్నాయి.  దీంతో నష్టాలలోకి  మారిన  కీలక సూచీల్లో  సెన్సెక్స్‌ 16 పాయింట్ల  నష్టంతో 33,603 వద్ద ,  నిఫ్టీ   9 పాయింట్లు తగ్గి 10,361 వద్ద స్థిరపడింది.

ముఖ్యంగా  ప్రభుత్వ బ్యాంకులు, ఐటీ,  నష్టపోగా రియల్టీ , ఫార్మా లాభపడింది. బాష్‌ దాదాపు 6 శాతం జంప్‌ చేసిన టాప్‌ విన్నర్‌గా నిలవగా,  ఇన్‌ఫ్రాటెల్‌, విప్రో, అదానీ పోర్ట్స్‌, కోల్‌ ఇండియా, సన్‌ ఫార్మా, ఐవోసీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌యూఎల్‌, అరబిందో లాభపడ్డాయి. అటు యాక్సిస్‌, జీ, ఏషియన్‌ పెయింట్స్‌, హిందాల్కో, వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, టీసీఎస్‌, యూపీఎల్‌, ఐషర్‌ నష్టపోయాయి.
 

మరిన్ని వార్తలు