వారాంతంలో లాభాలు

9 Aug, 2019 16:29 IST|Sakshi

సాక్షి,  ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు  వారాంతంలో లాభాల్లో ముగిసాయి. ఈ వారం ఆంరంభంనుంచి భారీ నష్టాలతో​ భయపెట్టిన మార్కెట్లు చివరికి లాభాలతో స్థిరంగా ముగియడం  విశేషం.  శుక్రవారం వరుసగా రెండో రోజు హుషారుగా ప్రారంభమైన మార్కెట్‌ ఇన్వెస్టర్ల కొనుగోళ్లతో ఒక దశలో 420 పాయింట్లకు పైగా జంప్‌ చేసింది. నిఫ్టీ కూడా అదే జోరును కొనసాగించింది. అయితే మిడ్‌సెషన్‌​ తరువాత  స్వల్పంగా వెనక్కి తగ్గిన మార్కెట్లలో సెన్సెక్స్‌ 255 పాయింట్లు లాభంతో 37,581 వద్ద, నిఫ్టీ 77 పాయింట్లు ఎగసి 11,109 వద్ద  ముగిసాయి.   గత అయిదువారాల్లో ఇదే  సానుకూల ముగింపు కాగా,  నిఫ్టీ 11100కుపైన ముగిసింది.  దాదాపు అన్ని సెక్టార్ల షేర్లు లాభాల్లోనే ముగిసాయి.  మారుతి, బజాజ​ ఫైనాన్స్‌, వేదాంతా, హెచ్‌డీఎఫ్‌సీ, హెచ్‌ యూఎల్‌,  కోటక్‌ మహీంద్ర,   టాప్‌ గెయినర్స్గా ఉన్నాయి.  మరోవైపు  యస్‌ బ్యాంకు, సిప్లా, హిందాల్కో, టెక్‌ మహీంద్ర, కోల్‌ ఇండియా, టాటా మోటార్స్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు