స్టాక్‌మార్కెట్లు లాభాల సెంచరీ

20 Mar, 2018 10:42 IST|Sakshi

సాక్షి,ముంబై:  స్టాక్‌మార్కెట్లు అనూహ‍్యంగా లాభాల్లోకి మళ్లాయి. ఆరంభ నష్టాలనుంచి భారీగా కోలుకున్న కీలక సూచీలు  మళ్లీ కీలక మద్దతుస్థాయిలకు పైకి చేరాయి. భారీగా పుంజుకున్న సెన్సెక్స్‌ 105 పాయింట్ల లాభంతో 33,028వద్ద , నిఫ్టీ 35 పాయింట్ల పెరిగి 10,128వద్ద స్థిరంగా  కొనసాగుతోంది.  ఫేస్‌బుక్‌ డేటా బ్రీచ్‌ అమెరికా మార్కెట్లును భాగా దెబ్బతీసింది.  ఒక మేరకు ఆసియా మార్కెట్లను ప్రభావితం  చేసినప్పటికీ భారత మార్కెట్లలో లాభాల వైపు మళ్లాయి.  ఐటీ , ఆటో లాభాల్లోనూ, ఫార్మా నష్టాల్లోనూ ట్రేడ్‌ అవుతోంది. టెక్‌ మహీంద్రా, హెచ్‌పీసీఎల్‌,మైండ్‌ ట్రీ, నష్టపోతున్నాయి. ఇంకా ఇదే  బాటలో ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, అరబిందో, యస్‌బ్యాంక్‌, ఐవొసీ, యాక్సిస్‌, కోల్‌ ఇండియా, డాక్టర్‌ రెడ్డీస్‌, ఇండస్‌ఇండ్‌ రిలయన్స్‌ ఇన్‌ఫ్రాం, సెయిల్‌, వేదాంతా, సిప్లా, కెనరాబ్యాంకు, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా నష్టపోతుండగా టాటా స్టీల్‌, సన్‌టీవీ, మారికో, హెచ్‌యూఎల్‌, ఐటీసీ , హెక్సావేర్‌ లాభపడుతున్నాయి.

అటు ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో పుత్తడి రూ. 85 నష్టపోయి 30, 333 వద్ద ఉంది.  మరోవైపు డాలర్‌ మారకంలో  దేశీయ కరెన్సీ రుపీ 0.04పైసల నష్టంతో 65.21 వద్ద ఉంది.

>
మరిన్ని వార్తలు