కొనసాగుతున్న జోష్‌ ; 11900 పైకి నిఫ్టీ

31 Oct, 2019 10:54 IST|Sakshi

ఆల్‌టైం గరిష్టానికి బీఎస్‌ఈ  సెన్సెక్స్

సాక్షి, ముంబై :  దేశీ స్టాక్‌ మార్కెట్లలో జోష్‌ కొనసాగుతోంది. ట్రేడింగ్‌ ప్రారంభంలోనే  సెంచరీ సాధించిన  కీలక సూచీ సెన్సెక్స్‌ ఇన్వెస్టర్లు కొనుగోళ్లతో  245 పాయిం‍ట్లకు పైగా ఎగిసింది.  అనంతరం  280 పాయింట్లు పుంజుకుని 40312 పాయింట్ల స్థాయిని అధిగమించడం ద్వారా దేశీయ బెంచ్‌మార్క్‌ సూచీ సెన్సెక్స్‌ కొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జూన్‌ 4న సెన్సెక్స్‌ 40,312 పాయింట్ల వద్ద ఆల్‌టైం రికార్డును ఏర్పరచగా, తాజాగా ఈ రికార్డును అధిగమించించింది. ప్రస్తుతం 218 పాయింట్ల లాభంతో  40,270 వద్ద  నిఫ్టీ  61 పాయింట్లు  ఎగిసి 11,905 వద్ద ట్రేడవుతోంది. అక్టోబర్‌ డెరివేటివ్‌ సిరీస్‌ నేడు ముగియనుంది. దీంతో ట్రేడర్ల అప్రమత్తత కొనసాగే అవకాశం ఉంది.

మరోవైపు అంచనాలకు అనుగుణంగా ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేటులో పావు శాతం కోతను విధించడంతో బుధవారం అమెరికా మార్కెట్లు లాభపడ్డాయి.  దాదాపు అన్ని రంగాలూ లాభపడగా, పీఎస్‌యూ బ్యాంక్స్‌, రియల్టీ, ఐటీ, మెటల్‌, ఫార్మా రంగాలు  లాభపడుతున్నాయి. ఎస్‌బీఐ, ఇన్ఫోసిస్‌, జీ, డాక్టర్‌ రెడ్డీస్‌, ఐటీసీ, బ్రిటానియా, గ్రాసిమ్‌, సన్‌ ఫార్మా, విప్రో, హిందాల్కో  లాభపడుతుండగా, ఇన్‌ఫ్రాటెల్, ఎయిర్‌టెల్‌, పవర్‌గ్రిడ్‌, ఐషర్, ఎంఅండ్‌ఎం నష్టాల్లో కొనసాగుతున్నాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా