లాభాల జోరు : 11860 ఎగువకు నిఫ్టీ

1 Jul, 2019 15:55 IST|Sakshi

సాక్షి, ముంబై:  స్టాక్‌మార్కెట్లు ఈసిరీస్‌లో సోమవారం శుభారంభాన్నిచ్చాయి.  ఆరంభ లాభాలనుంచి మరింత ఎగిసి పటిష్టంగా ముగిశాయి.సెన్సెక్స్‌ 292 ఎగిసి 39686 వద్ద, నిఫ్టీ  77 పాయింట్లు పుంజుకుని 11866 వద్ద ముగిశాయి.  దాదాపు అన్ని రంగాల్లోనూ లాభాలు కనిపించగా,   అంతర్జాతీయంగా చమురు 5 వారాల గరిష్టానికి చేరడంతో  ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. 

ప్రధానంగా జూన్‌ మాసంలో మారుతి , ఎంఅండ్‌ ఎం, అశోక్‌ లేలాండ్‌ మినహా  మిగిలిన ఆటో  కంపెనీలు విక్రయాల్లో  వృద్ధిని సాధించాయి. దీంతో ఆటో కంపెనీ లాభాలు సూచీలకు భారీ మద్దతు నిచ్చాయి. జీ, డా రెడ్డీస్‌, రిలయన్స్‌, ఐటీసీ, ఐబీ హౌసింగ్‌, తోపాటు టాటా మోటార్స్‌, బజాజ్‌ ఆటో, ఐషర్,  లాభపడ్డాయి. అయితే  మారుతి  నష్టపోయింది.  అలాగే ఓఎన్‌జీసీ, ఐవోసీ, బీపీసీఎల్‌, కోల్‌ ఇండియా, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఇన్ఫ్రాటెల్‌, టైటన్‌, అల్ట్రాటెక్‌, గెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌  టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

>
మరిన్ని వార్తలు