లాభాల జోరు: బ్యాంక్స్‌, ఆటో అప్‌

26 Sep, 2019 09:30 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 100పాయింట్లకు పైగా, నిఫ్టీ  50 పాయింట్లు పుంజుకుంది. బ్యాంక్‌ నిఫ్టీ  కూడా పాజిటివ్‌గా ఆరంభమైంది.  ప్రస్తుతం 247 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ 38840 వద్ద, నిప్టీ 80 పాయింట్ల లాభంతో 11520 వద్ద కొనసాగుతోంది. ప్రధానంగా బ్యాంకింగ్‌, ఆటో రంగాలు లాభపడుతున్నాయి. ఎన్‌బీఎఫ్‌సీలకోసం ప్రభుత్వం ప్రత్యేక ఊరటనివ్వనుందనే  అంచనా ఫైనాన్స్‌ సంస్థలకు సానుకూలంగా మారింది.  ఐసీఐసీఐ బ్యాంకు, మారుతి సుజుకి, ఇండస్‌ఇండ్‌, కోటక్‌మహీంద్ర  బ్యాంకు, హెచ్‌యూఎల్‌, రిలయన్స్‌,బజాజ్‌ పైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ  లాభపడుతున్నాయి.  మరోవైపు యస్‌బ్యాంకు, హెచ్‌సీఎల్‌ టెక్‌, కోల్‌ ఇండియా, జేఎస్‌డబ్ల్యూ స్టీల​, పవర్‌ గ్రిడ్‌, యాక్సిస్‌ బ్యాంకు,  ఇన్ఫోసిస్‌ నష్టపోతున్నాయి.

మరిన్ని వార్తలు