ఊగిసలాటలో స్టాక్‌మార్కెట్లు: మెటల్స్‌ షైనింగ్‌

26 Mar, 2018 09:32 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీ స్టాక్‌మార్కెట్లు   స్వల్ప నష్టాల్లో ప్రారంభమైనాయి.  సెన్సెక్స్‌  6పాయింట్ల నష్టంతో,నిఫ్టీ 3 పాయింట్ల నష్టంతో ప్రారంభమైనా వెంటనే  లాభాల్లోకి మళ్లాయి. సెన్సెక్స్‌ 46 పాయింట్లు పుంజుకుని 32, 650కి ట్రేడ్‌అయ్యాయి. పదివేలకు దిగువన ప్రారంభమైన నిఫ్టీ 12 పాయింట్లు పుంజుకుని 10వేలస్థాయిని దాటింది.  అయితే ఇన్వెస్టర్ల అమ్మకాలతో కీలక సూచీలు లాభనష్టాలమధ్య  ఊగిసలాడుతున్నాయి. ముఖ్యంగా నిఫ్టీ తిరిగి నష్టాలతో 10వేల దిగువకు చేరింది.

మెటల్స్‌,రియల్టీ రంగ లాభాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి. అటు పీఎస్‌యూ బ్యాంక్‌ ఫార్మా కూడా లాభ పడుతోంది.  అయితే హై స్థాయిల్లో  అమ్మకాల ఒత్తిడి నెలకొంటోంది. ఐడీబీఐ భారీగా నష్టపోతోంది.   యాక్సిస్‌బ్యాంక్‌ టాటా మోటార్స్‌, గెయిల్‌, ఐటీసీ, వేదాంతా,  గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, బీపీసీఎల్‌, ఐవోసీ, ఐషర్‌, టీసీఎస్, బాష్‌, భారతీ, హీరోమోటో నష్టపోతుండగా, ఐసీఐసీఐ, ఎస్‌బీఐ మారికో,అదానీపోర్ట్‌, సన్‌ఫార్మా, టాటాస్టీల్‌, ఆర్‌కాం లాభపడుతున్న వాటిల్లో  ఉన్నాయి.

మరిన్ని వార్తలు