స్టాక్‌మార్కెట్ల హైజంప్‌: పీఎస్‌యూ బ్యాంక్స్‌ వీక్‌

12 Mar, 2018 15:42 IST|Sakshi

సాక్షి, ముంబై:  గ్లోబల్‌ మార్కెట్ల సానుకూల  సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. ఆరంభంలోనే పాజిటివ్‌నోట్‌తో  మురిపించిన  మార్కెట్లో  మిడ్‌ సెషన్‌ తరువాత మరింత పుంజుకుని చివరివరకూ అదే జోష్‌ను కంటిన్యూ చేశాయి. ముగింపులో  దలాల్‌ స్ట్రీట్‌లో కొనుగోళ్లు మరింత పుంజుకోవడంతో సెన్సెక్స్‌ 611 పాయింట్ల పుంజుకుని 33,919 వద్ద,నిఫ్టీ 195 పాయింట్లు  లాభంతో 10,422వద్ద ముగిశాయి.   సెన్సెక్స్‌, నిఫ్టీ ఇంట్రా డేలో అత్యధక లాభాల ను నమోదు చేశాయి.  దీంతో  నిఫ్టీ 10400కి ఎగువన, సెన్సెక్స్‌ 34వేలకు చేరువలో ముగియడం విశేషం.

 పీఎస్‌యూ బ్యాంక్స్‌ పతనం కొనసాగగా ఎఫ్‌ఎంసీజీ, ప్రయివేట్‌ బ్యాంక్స్‌ మార్కెట్‌కు భారీ మద్దతునిచ్చాయి. వీటితోపాటు ఐటీ, ఆటో, మెటల్‌ భారీ లాభాలను ఆర్జించాయి.  రిలయన్స్‌ కేపిటల్‌,  యునైటెడ్‌ స్పిరిట్స్‌,  వేదాంత, ఐవోసీ,   సెయిల్‌, ఎన్‌టీపీసీ మెక్‌డోవెల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, ఐటీసీ, సెంచురీ టెక్స్‌, జేపీ, శ్రేఈ ఇన్‌ఫ్రా, సీజీ పవర్‌, ఎన్‌సీసీ  లాభపడ్డాయి.  మరోవైపు భారీ కుంభకోణంతో ఆంధ్రా బ్యాంక్‌  భారీ పతనాన్ని నమోదు చేయగా,  ఐడీబీఐ, పీఎఫ్‌సీ, ఓబీసీ, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, హెచ్‌డీఐఎల్‌, సిండికేట్‌, అలహాబాద్‌, కెనరా బ్యాంక్‌తో పాటు కోల్‌ ఇండియా, అశోక్‌లేలాండ్‌, ఎంఅండ్‌ఎండ్ ఫైనాన్షియల్‌‌, కాంకర్‌,  నష్టపోయాయి.
 

మరిన్ని వార్తలు