ఫ్లాట్‌ ప్రారంభం : ప్రైవేట్‌  బ్యాంక్స్‌ డౌన్‌

30 Sep, 2019 09:25 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ మార్కెట్ల సంకేతాలతో కీలక సూచీలు రెండూ నష్టపోతున్నాయి. సెన్సెక్స్‌119 పాయింట్ల నష్టంతోమ 38702 వద్ద, నిఫ్టీ 34 పాయింట్లు కోల్పోయి 11482 వద్ద కొనసాగుతోంది. తద్వారా నిఫ్టీ 11500 దిగువకు చేరింది. ఐటీ, ఫార్మ తప్ప దాదాపు అన్నిరంగాలూ నష్టపోతుండగా, ప్రధానంగా ప్రైవేట్‌ బ్యాంక్ షేర్లలో అమ్మకాలు భారీగా కనిపిస్తున్నాయి.  యస్‌బ్యాంకు 5శాతం,  సిప్లా, వేదాంతా, ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు, టాటా స్టీల్‌, హిందాల్కో ,సన్‌ఫార్మి, ఏషియన్‌ పెయింట్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌ నష్టపోతున్నాయి. హెచ్‌సీఎల్‌ టెక్‌,టీసీఎస్‌,యూపిఎల్‌, బీపీసీఎల్‌, యాక్సిస్‌ బ్యాంకు, టెక్‌మహీంద్ర, హీరో మోటా కార్ప్‌, రిలయన్స్‌,టైటన్‌ లాభపడుతున్నాయి. మరోవైపు డాలరు మారకంలో రుపీ స్వల్ప లాభంతో  ట్రేడింగ్‌ను ఆరంభించింది. శుక్రవారం నాటి ముగింపు 70.55 తో పోలిస్తే సోమవారం 70.42 వద్ద ట్రేడ్‌ అవుతోంది. 

మరిన్ని వార్తలు