నష్టాల్లో కొనసాగుతున్న మార్కెట్లు

26 Dec, 2019 14:31 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ  స్టాక్‌మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ఆరంభంలోనే బలహీనంగా ఉన్న సూచీలు మిడ్‌సెషన్‌ తరువాత మరింత క్షీణించాయి. సెన్సెక్స్‌ 185 పాయింట్లు నష‍్టంతో 41277 వద్ద, నిఫ్టీ 56 పాయింట్లు క్షీణించి 12158 వద్ద కొనసాగుతున్నాయి. ఆటో, ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలు షేర్లు అమ్మకాల ఒత్తిడిని  ఎదుర్కొంటున్నాయి. ప్రధానంగా బ్యాంకింగ్‌  షేర్లు భారీగా నష్టపోతున్నాయి. యస్‌ బ్యాంకు, ఐవోసీ, కోల్‌ ఇండియా, లార్సెన్‌, భారతి ఎయిర్‌టెల్‌,జీ  టాప్‌ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి.  మరోవైపు వేదాంతా, టాటా స్టీల్‌, ఎం అండ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ, ఆషియన్‌ పెయింట్స్‌, హీరోమోటో, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభపడుతున్నాయి.
 

మరిన్ని వార్తలు