ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

12 Feb, 2019 09:21 IST|Sakshi

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండోరోజు కూడా నెగిటివ్‌ నోట్‌తో ప్రారంభమైనాయి. అనంతరం నష్టాలనుంచి కోలుకోవడం గమనార్హం. మిడ్‌క్యాప్‌, నిఫ్టీ బ్యాంకు సెక్టార్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. దీంతో 40 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్‌ వెంటనే తేరుకుని 31 పాయింట్లు ఎగిసి 36,426వద్ద నిఫ్టీ కూడా 9పాయింట్లు ఎగిసి 10897వద్ద కొనసాగుతోంది. ఎల్‌ అండ్‌ టీ, హెచడీఎఫ్‌సీ, కోటక్‌, ఎస్‌బీఐ, ఎస్‌ బ్యాంకు, రిలయన్స్‌ ఇన్‌ఫ్రా లాభపడుతుండగా, రిలయన్స్‌  క్యాపిటల్‌ , యాక్సిస్‌, ఐసీఐసీఐ బ్యాంకు నష్టపోతున్న వాటిల్లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు