నష్టాల్లో మార్కెట్లు: బ్యాంక్‌ షేర్లు బేర్‌!

20 Apr, 2018 09:33 IST|Sakshi
స్టాక్‌మార‍్కెట్‌ నష్టాలు(ఫైల్‌ ఫోటో)

సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. ఇన్వెస్టర్ల అమ్మకాలతో నష్టాల్లోకి మళ్లాయ. ప్రస్తుతం సెన్సెక్స్‌ 53పాయింట్ల నష్టపోయి 34,374 వద్ద,  నిఫ్టీ 15 పాయింట్లు క్షీణించి 10,550 వద్ద కొనసాగుతున్నాయి. బ్యాంకు షేర్ల నష్టాలు మార్కెట్లను ప్రభావితం చేస్తున్నాయి.  నిఫ్టీ బ్యాంకు 100 పాయిం‍ట్లకు పైగా నష్టాలతో కొనసాగుతోంది.  మరోవైపు ఐటీ షేర్లలో కొనుగోళ్ళ  ధోరణి కనిపిస్తోంది. నిన్నటి ఫలితాల నేపథ్యంలో టీసీఎస్‌ లాభపడుతోంది.  వేదాంతా, టాటా స్టీల్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, ఐటీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఎస్‌బీఐ, పవర్‌గ్రిడ్‌, యస్‌బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్‌ ఇండ్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, కోటక్‌ మహీంద్ర, ఐడీబీఐ, ఐషర్‌ మోటార్స్‌  నష్టపోతుండగా  విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్‌, టెక్‌మహీంద్రా, ఇన్ఫోసిస్‌, టాటా మోటార్స్‌, హెక్సావేర్‌, మైండ్‌ ట్రీ, ఐవోసీ, గెయిల్‌, హెచ్‌పీసీఎల్‌, టైటన్‌ లాభపడుతున్నవాటిలో​ ఉన్నాయి.

మరోవైపు ఇటీవల బలహీనపడుతూ వస్తున్న రూపాయి శుక్రవారం మరింత నీరసించింది. 66.07వద్ద సంవత్సర కనిష్టానికి చేరింది. దాదాపు 0.41 పైసలు నష్టపోయి 66.07 స్థాయికి చేరింది.

మరిన్ని వార్తలు