ఫ్లాట్‌ ప్రారంభం

21 Aug, 2019 09:22 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా  ట్రేడింగ్‌ను ఆరంభించాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో ప్రస్తుతం  సెన్సెక్స్‌ 15 పాయింట్ల నష్టంతో 37306 వద్ద, నిఫ్టీ 18 పాయింట్లు క్షీణించి 10998  వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా 11వేల  స్థాయి వద్ద ఊగిసలాడుతోంది. ఆటో, ఐటీ లాభపడుతున్నాయి. దువ్వాడ అబ్జర్వేషన్స్‌ కారణంగా డా.రెడ్డీస్‌, అలాగే ఒబెరాయ్‌ రియల్టీ, భారీగా నష్టపోతోంది. ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌,మారుతి, ఐషర్‌, సన్‌ఫార్మ, హీరోమోటోకార్స్‌,ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఆటో, ఎస్‌బీఐ,పవర్‌గ్రిడ్‌ లాభపడుతుండగా, యస్ బ్యాంకు మరోసారి  52 వారాల కనిష్టాన్ని తాకి మరింత బలహీనపడింది. ఇంకా బ్రిటానియా, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, వేదాంతా, హిందాల్కో,  బీపీసీఎల్‌ ,టాటామోటార్స్‌ నష్టాల్లో ఉన్నాయి. 

అటు డాలరుమారకంలో  దేశీయ కరెన్సీ  పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించింది.  మంగళవారం నాటి ముగింపు 71.70 తో  పోలిస్తే 71.45 వద్ద కొనసాగుతోంది. అమెరికా-చైనా ట్రేడ్‌వార్‌పై అంచనాల నేపథ్యంలో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు స్వల్పంగా పుంజుకున్నాయి.   

మరిన్ని వార్తలు