ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

14 Nov, 2017 09:22 IST|Sakshi


సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు స్వల్ప నష్టాలతో  ప్రతికూలంగా  ప్రారంభమయ్యాయి సెన్సెక్స్‌21 పాయింట్ల నష్టతో నిఫ్టీ 4 పాయింట్ల నష్టంతో ఫ్లాట్‌గా  ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఐఐపీ, డేటా నిరాశపర్చడం,  ఇన్వెస్ట సెంటిమెంట్‌ బలహీనం తదితర కారణాల రీత్యా మార్కెట్లు ఫ్లాట్‌గా లేదా స్వల్ప నష్టాలతో కదలాడవచ్చని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి.  బ్యాంక్‌ నిఫ్టీ  కూడా ఫ్లాట్‌గా ఉంది.  ప్రాఫిట్‌బుకింగ్‌  కారణంగా దాదాపు అన్ని సెక్టార్లు నష్టాల్లో ఉన్నాయి.  

ఎస్‌బీఐ, సన్‌పార్మ, ఓన్‌జీసీ ఐటీసీ, జేపీ అసోసియేట్‌ , జెట్‌ ఎయిర్‌వేస్‌ నష్టాల్లోఉన్నాయి. అపోలో హాస్పిటల్స్‌, అశోకా బిల్డ్‌కాన్‌ లాభాల్లో  ఉన్నాయి. 

కాగా గత మూడు రోజుల్లో రూ. 4,800 కోట్ల విలువైన స్టాక్స్‌ విక్రయించిన విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐలు) నగదు విభాగంలో సోమవారం రూ. 233 కోట్లకుపైగా పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు.  మరోవైపు గత మూడు రోజుల్లో రూ. 5,200 కోట్లను ఇన్వెస్ట్‌ చేసిన దేశీ ఫండ్స్‌(డీఐఐలు) సోమవారం మరోసారి దాదాపు రూ. 269 కోట్ల విలువైన స్టాక్స్‌ కొనుగోలు చేశాయి.

మరిన్ని వార్తలు