ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు

13 Nov, 2019 09:44 IST|Sakshi

 సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. అనంతరం పుంజుకుని  సెన్సెక్స్‌  73  పాయింట్లు  లాభపడి 40418 వద్ద, నిఫ్టీ 20 పాయింట్ల లాభతో 11934వద్ద కొనసాగుతున్నాయి.   జీ, సన్‌టీఈవీ, గెయిల్‌, ఇన్ఫోసిస్‌, భారతి ఎయిర్టెల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, హిందాల్కో, సిప్లా  నష్టపోతుండగా  బ్రిటానియా , టీసీఎస్‌ ,యస్‌ బ్యాంకు,  రిలయన్స్‌, కోల్‌ఇండియా,  ఇన్ఫో ఎడ్జ్‌, పిరామల్‌ లాభపడుతున్నాయి. "గురు నానక్ జయంతి" ని పురస్కరించుకుని  మంగళవారం ఈక్విటీ,కరెన్సీ మార్కెట్లు పనిచేయలేదు.  

మరోవైపు దేశీయ కరెన్సీ రూపాయి డాలరు మారకంలో బలహీనంగా ప్రారంభమైం‍ది. ఇంటర్‌బ్యాంక్ రూపాయి డాలర్‌తో పోలిస్తే 71.75 వద్ద ప్రారంభమైంది, తరువాత 71.77 కు పడిపోయింది, ఇది మునుపటి ముగింపుతో పోలిస్తే 30 పైసల క్షీణించిఇంది. సోమవారం. 71.47 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు