డబుల్‌ సెంచరీ లాభాలతో సూచీలు జూమ్‌

27 Mar, 2019 09:26 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి.  డబుల్‌ సెంచరీ లాభాలతో ప్రారంభమైన సెన్సెక్స్‌185 పాయింట్ల లాభంతో 38,418 వద్ద, నిఫ్టీ  45 పాయింట్లు ఎగిసి 11528వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  తద్వారా సెన్సెక్స్‌ 38వేల ఎగువకు, నిఫ్టీ 11500 ఎగువన కొనసాగుతున్నాయి. బ్యాంకునిఫ్టీ మరోసారి30వేల మార్క్‌ను అధిగమించి ఆల్‌ టైం హైని నమోదు  చేసింది.  దాదాపు అన్ని రంగాలు లాభాల్లోనే.

బ్యాంక్‌ నిఫ్టీ, ఫార్మా, మెటల్‌, రియల్టీ , ప్రభుత్వ బ్యాంకింగ్‌ బాగా లాభపడుతున్నాయి. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు, ఎస్‌బ్యాంకు, ఎస్‌బీఐ, ఐసీఐసీఐ ప్రూడెన్షియల్‌ లాభపడుతున్నాయి. అలాగే జెట్‌ ఎయిర్‌వేస్‌ వరుసగా మూడో రోజు కూడా లాభపడుతోంది.  మరోవైపు క్రూడ్‌ ఆయిల్‌ ధరలు  పుంజుకోవడంతో  ఆయిల్‌ షేర్లతోపాటు  ఇన్‌ఫ్రా షేర్లు  నష్టపోతున్నాయి. 

ఇండస్‌ఇండ్, ఎయిర్‌టెల్‌, ఐవోసీ, ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, సన్‌ ఫార్మా, ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, వేదాంతా  టాప్‌విన్నర్స్‌గా కొనసాగుతున్నాయి. ఓఎన్‌జీసీ, ఎన్‌టీపీసీ, హెచ్‌పీసీఎల్‌, టెక్‌ మహీంద్రా, ఐషర్‌ స్వల్పంగా నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు