లాభాల ప్రారంభం

11 Dec, 2019 09:29 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు  స్వల్ప లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో   మంగళవారం నాటి బలహీనత నుంచి పుంజుకున్నాయి. సెన్సెక్స్‌ 71  పాయింట్లు ఎగిసి 40311 వద్ద, నిఫ్టీ 21 పాయింట్లు లాభంతో 11878 వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి. 

టీసీఎస్‌, ఎన్‌టీపీసీ, ఐటీసీ, ఐసీఐసీఐ బ్యాంకు, టెక్‌ మహీంద్ర, టాటా స్టీల్‌, జీ ఎంటర్‌టైన్‌మెంట్‌,  గెయిల్‌, ఎం అండ్‌ ఎం లాభపడుతున్నాయి. అటు యస్‌ బ్యాంకు ఆరంభంలోనే 6శాతం నష‍్టపోయింది.అలాగే గత ఆర్థిక సంవత్సర ఫలితాల్లో దాదాపు రూ.12,000 కోట్ల మేర మొండిబాకీలు బయటపడలేదన్న వార్తల నేపథ్యంలో ఎస్‌బీఐ  షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.  రిజర్వ్‌ బ్యాంకు ఆడిట్‌లో రూ.11,932 కోట్ల మేర వ్యత్యాసం (డైవర్జెన్స్‌) వచ్చినట్లు ఎస్‌బీఐ మంగళవారం తెలిపింది. ఐషర్‌ మోటార్స్‌,  యూపీఎల్‌, సిప్లా, హెచ్‌యూఎల్‌, పవర్‌ గ్రిడ్‌, రిలయన్స్‌, భారతి ఎయిర్టెల్‌ నష్టపోతున్నాయి. డాలరుమారకంలో రూపాయి 12 పైసలు పుంజుకుని 70.80 వద్ద కొనసాగుతోంది. 

మరిన్ని వార్తలు