సూచీల దూకుడు, సెంచరీ లాభాలు

30 Dec, 2019 09:19 IST|Sakshi

సాక్షి,ముంబై:  దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 72 పాయింట్లు లాభపడి  నిఫ్టీ19 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి. అనంతరం సూచీలు మరింత  జోరుగా కొనసాగుతున్నాయి.  సెన్సెక్స్‌ సెంచరీ లాభాలను సాధించగా , నిఫ్టీ మరో సరికొత్త గరిష్టానికి చేరువలో వుంది.  బ్యాంకు నిఫ్టీ మరో ఆల్‌ టైం రికార్డును నమోదు చేసింది. దాదాపు అన్ని సెక్టార్లు పాజిటివ్‌గా  ప్రారంభమైనాయి. ముఖ్యంగా ఆటో, ‍ఐటీ, బ్యాంకింగ్‌ లాభపడుతున్నాయి. యస్‌ బ్యాంకు,  జీ, కోల్‌ ఇండియా, బీపీసీఎల్‌, ఎస్‌బీఐ,  రిలయన్స్‌ , వేదాంతా నష్టపోతుండగా  టీసీఎస్‌, సన్‌ ఫార్మ, ఐటీసీ, కోటక్‌  మహీంద్ర, హెచ్‌డీఎఫ్‌సీ, అల్ట్రా టెక్‌, ఎం అండ్‌ఎండ్‌, హెసీఎల్‌ టెక్‌, ఓఎన్‌జీసీ, టాటా  మోటార్స్‌, ఐసీఐసీఐ, మారుతి సుజుకి, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు లాభాలతో ఉన్నాయి.   

మరోవైపు డాలరు మారకంలో రూపాయి  71.36 వద్ద కొనసాగుతోంది.  అటు క్రూడ్‌, బంగారం ధరలు తమ దూకుడును కొనసాగిస్తున్నాయి.  

మరిన్ని వార్తలు