రిలయన్స్ జంప్ : భారీ లాభాలు

8 Jun, 2020 09:26 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాల్లో ప్రారంభమైనాయి. సెన్సెక్స్ 638  పాయింట్లు ఎగిసి 34909 వద్ద, నిఫ్టీ 180 పాయింట్లు లాభపడి 10325 వద్ద కొనసాగుతోంది.  ప్రధానంగా బ్యాంకింగ్ షేర్లలో కొనుగోళ్లతో బ్యాంకు నిఫ్టీ  భారీ లాభాలతో కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్ల సానుకూల సంకేతాలతో వరుసగా రెండో వారంలో కూడా  కీలక సూచీలు  పాజిటివ్ గా వున్నాయి. సెన్సెక్స్ 35వేల దిశగాపరుగులు పెడుతుండగా, నిఫ్టీ 10300 ఎగువన స్థిరంగా ఉంది. ఇండస్ఇండ్, బజాజ్ ఫిన్ సర్వ్ రిలయన్స్, ఎస్బీఐ, ఎల్ అండ్ టీ లాంటి హెవీ వెయిట్స్ భారీ లాభాలు మార్కెట్ కు ఊత మిస్తున్నాయి. రిలయన్స్ 3 శాతానికి పైగా లాభపడుతోంది.  ప్రధానంగా మెటల్, సిమెంట్, ఎయిర్ లైన్స్ షేర్లు లాభపడుతున్నాయి.  ఫలితాల ప్రభావంతో ఎక్సైడ్ నష్టపోతోంది.  ఇంకా దివీస్, కర్ణాటక బ్యాంకు స్వల్పంగా నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు