లాభాలతో ప్రారంభం

11 Jun, 2019 09:37 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. అంతర​ అంతర్జాతీయ సానుకూలతతో  మన మార్కెట్లుకూడా పాజిటివ్‌గా ట్రేడింగ్‌ను ఆరంభించాయి. ఆరంభంలో 100 పాయింట్లకు పైగా ఎగిసిన సెన్సెక్స్‌ ప్రస్తుతం  ‌56 పాయింట్ల లాభంతో 39847 వద్ద, నిఫ్టీ 10 పాయింట్లు ఎగిసి 11932 వద్ద కొనసాగుతోంది. భారత్‌ ఫిన్‌తో విలీనానికి ఎన్‌సీఎల్‌టీ ఆమోదం లభించిన నేపథ్యంలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంకు టాప్‌ గెయినర్‌గా ఉంది. హెచ్‌సీఎల్‌, టీసీఎస్‌, వేదాంతా,  టాటా మోటార్స్‌, ఓన్‌జీసీ. కోల్‌ ఇండియా, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌ లాభ పడుతున్నాయి. మరో ఇండియా బుల్స్‌ హౌసింగ్‌, సన్‌ఫార్మా,ఎంఅండ్‌ ఎం, భారతి  ఇన్‌ఫ్రాటెల్‌, డీఆర్‌ఎల్‌,  డీహెచ్‌ఎఫ్‌ఎల్‌, ఫెడరల్‌బ్యాంకు, జీఎంఆర్‌, యూనియన్‌ బ్యాంకు, అదానీ పవర్‌ నష్టపోతున్నాయి. 

మరిన్ని వార్తలు