ప్రీ బడ్జెట్‌ ర్యాలీ:  సెంచరీ లాభాలు

27 Jun, 2019 09:27 IST|Sakshi

సాక్షి, ముంబై : ఫ్లాట్‌గా ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు వెంటనే  సెంచరీ లాభాలకు వైపు  పుంజుకున్నాయి.  సెన్సెక్స్‌ 107 పాయింట్లు ఎగిసి 39699 వద్ద,  నిఫ్టీ 32 పాయింట్ల లాభంతో 11880 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఆటో, బ్యాంకింగ్‌  షేర్లు లాభపడుతున్నాయి.  భారతి ఇన్‌ఫ్రా, జీ, భారతి ఎయిర్‌టెల్‌, వేదాంతా, ఎన్‌టీపీసీ, మారుతి లాభపడుతుండగా,  కాక్స్‌ అండ్‌ కింగ్‌  టాప్‌ లూజర్‌గా ఉంది. రిలయన్స్‌ , ఇమామి, అదానీ నష్టపోతున్నాయి. అలాగే  గ్లోబల్‌గా చమురు ధరలు మంటుతుండటంతో ఆయిల్‌ రంగ షేర్లు బలహీనంగా ఉన్నాయి. అయితే ఎఫ్‌ అండ్‌ వో సిరీస్‌  నేడుముగియనున్న నేపథ్యంతో అప్రమత్తతను పాటించాలని ఎనలిస్టులు చెబుతున్నారు.  అటు డాలరు మారకంలో రుపాయి  నెగిటివ్‌గా వుంది.  17 పైసలు నష్టపోయి 69. 32 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు