లాభాల ప్రారంభం: టెలికాం షేర్లు ఢమాల్‌

13 Jun, 2018 09:30 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి.  సెన్సెక్స్‌105 పాయింట్ల లాభంతో  35, 797వద్ద , నిఫ్టీ 25 పాయింట్లు ఎగిసి 10868 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని సెక్టార్లు లాభాల్లోనే కొనసాగుతున్నాయి. అయితే డేటా టారిఫ్‌ వార్‌  నేపథ్యంలో టెలికాం షేర్లు భారీగా నష్టపోతున్నాయి. ఎయిర్‌టెల్‌, ఐడియా, ఆర్‌ కాం షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది.    పీఎస్‌యూ బ్యాంక్స్‌, ఐటీ,   షేర్లకు కొనుగోళ్ల మద్దు లభిస్తోంది. టీసీఎస్‌, సన్‌ ఫార్మ , మారుతి లాభపడుతున్నాయి. ఇండియా బుల్స్‌, భారతి ఎయిర్‌టెల్‌,  ఓ ఎన్‌జీసీ, కోటక్‌ మహీంద్ర, బజాజ్‌ ఫిన్‌ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.

మరిన్ని వార్తలు