బ్యాంకింగ్ జోరు, లాభాల్లో సూచీలు

28 May, 2020 09:35 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 260 పాయింట్ల లాభంతో 31860 వద్ద, నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 9393 వద్ద కొనసాగుతున్నాయి. ప్రపంచ సానుకూల ధోరణికి తోడు బ్యాంకింగ్, ఫైనాన్షియల్ స్టాక్స్‌లో భారీ కొనుగోళ్లు మార్కెట్ కు  మద్దతునిస్తున్నాయి. ఐటీ ఫార్మా తప్ప దాదాపు అన్ని రంగాలు లాభాల్లో ఉన్నాయి. దీంతో నిఫ్టీ 9350 స్థాయిని అధిగమించింది.  హెచ్ డీఎఫ్ సీ, ఇండస్ ఇండ్, ఐసీఐసీఐ బ్యాంకు, టాటా మోటార్స్,  ఎల్ అండ్ టీ,  ఒఎన్‌జిసి, వేదాంత లాభపడుతుండగా, మహీంద్రా అండ్ మహీంద్రా,  ఐటీసీ, ఇన్ఫోసిస్, టీసీఎస్, విప్రో నష్టపోతున్నాయి. మరోవైపు సియాట్, అగ్రో టెక్ ఫుడ్స్, దావత్, ఫెడరల్ బ్యాంక్, లుపిన్, ముథూట్ ఫైనాన్స్, రాడికో, టీవీఎస్ మోటార్స్ వంటి సంస్థలు తమ  ఫలితాలను వెల్లడించనున్నాయి. 

 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా