లాభాల రింగింగ్‌: బ్యాంక్స్‌ అప్‌

10 Jun, 2019 09:22 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాల్లో ప్రారంభమైనాయి. మెక్సికో దిగుమతులపై టారిఫ్‌ల విధింపు యోచనను ట్రంప్‌ ప్రభుత్వం విరమించుకోవడం వంటి సానుకూల వార్తలతో  గ్లోబల్‌ మార్కెట్లు  సానుకూలంగా ఉన్నాయి. దీంతో ఆయిల్‌ తప్ప దాదాపు అన్ని రంగాలూ పాజిటివ్‌గా ఉన్నాయి.  

సెన్సెక్స్‌  323 పాయింట్లు ఎగిసి 39939 వద్ద, నిఫ్టీ 94 పాయింట్లు లాభపడి 11965 వద్ద  ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.  ప్రధానంగా బ్యాంకింగ్‌ షేర్లలో  కొనుగోళ్లకు  ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతున్నారు.   మరోవైపు ఆయిల్‌ రంగ షేర్లలోఅమ్మకాలు కనిపిస్తున్నాయి.  అలాగే జేకే  బ్యాంకుపై  వచ్చిన అవినీతి ఆరోపణలు, బ్యాంక్‌ ఛైర్మన్‌పై వేటు వేసిన నేపథ్యంలో జె అండ్‌ కే షేరు భారీగా నష్టపోతోంది.  ఇండియాబుల్స్‌, ఐటీసీ, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, బీవోబీ తదితర బ్యాంకులు లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు