నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌మార్కెట్లు

8 Mar, 2019 09:21 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు  నష్టాలతో ప్రారంభమైనాయి.వరుస లాభాలకు చెక్‌పెడుతూ   ట్రేడింగ్‌ ఆరంభంలో 11వేల స్థాయిని కోల్పోయిన నిఫ్టీ ఆ తరువాత పుంజుకుంది. సెన్సెక్స్‌  40 పాయింట్లు బలహీనడి 36695 వద్ద, నిఫ్టీ 15 పాయింట్లు నష్టపోయి 11042వద్ద కొనసాగుతోది.  రుపీ బలహీనత నేపథ్యంలో బ్యాంకింగ్‌ సెక్టార్‌   వెనుకడుగులో ఉంది. విప్రో, హిందాల్కో, ఐవోసీ, హెచ్‌సీఎల్‌, ఓఎన్‌జీసీ,  అశోక్‌లేలాండ్‌  నష్టపోతున్నాయి.  ఎన్‌టీపీసీ, భారతి ఎయిర్‌టెల్‌, ఇండియాముల్స​ ఇన్‌ఫ్రాటెల్‌, యస్‌ బ్యాంకు లాభపడుతున్నాయి. 

మరోవైపు రూపాయి బలహీనంగా  ప్రారంభమైంది.  వరుసలాభాలకుచెక్‌  పెడుతూ శుక్రవారం 18పైసలు క్షీణించింది. 

మరిన్ని వార్తలు