లాభాల స్వీకరణ, నష్టాల్లో సూచీలు

8 Apr, 2020 09:15 IST|Sakshi

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్  మార్కెట్లు  నష్టాల్లో ట్రేడింగును ఆరంభించాయి.  సెన్సెక్స్ 271 పాయింట్లు క్షీణించి  29800 వద్ద, నిప్టీ 74 పాయింట్లు పతనమై 8718 వద్ద కొనసాగుతున్నాయి. తద్వారా మంగళవారం నాటి లాభాలను  కోల్పోయాయి. ప్రధానంగా బ్యాంకు నిఫ్టీలో లాభాల స్వీకరణ కనిపిస్తోంది. దీంతో  ప్రభుత్వ రంగ షేర్లు  నష్టపోతున్నాయి.  ఫార్మ లాభపడుతోంది. ఇండస్ ఇండ్ బ్యాంకు, ఎస్బీఐ, ఎస్ బ్యాంకు, యాక్సిస్, ఆర్ బీఎల్ తదితర బ్యాంకింగ్ నష్టపోతున్నాయి.  బయోకాన్,  గోద్రెజ్ కన్జ్యూమర్స్ , సిప్లా, అరబిందో ఫార్మ లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు