బలహీనంగా స్టాక్‌మార్కెట్లు

11 Feb, 2019 09:32 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు బలహీనంగా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 140 పాయింట్లు కోల్పోగా,నిప్టీ  54 పాయింట్లకు పైగా  కోల్పోయింది. దీంతో సెన్సెక్స్‌ 37వేల మార్క్‌, నిఫ్టీ 11వేల మార్క్‌ దిగువకు చేరింది. అన్ని రంగాలు నష్టపోతున్నాయి. 

ఇండియా బుల్స్‌ హౌసింగ్‌ టాప్‌ లూజర్‌గా ఉంది. ఎం అండ్‌ ఎం, హీరోమ మోటోకార్ప్‌, నాల్కో, ఓఎన్‌జీసీ డీహెచ్‌ఎఫ్‌ఎల్‌ భారీగా నష్టపోతున్నాయి. ఎస్‌బ్యాంకు, యాక్సిస్‌, ఐసీఐసీఐ, ఫెడరల్‌ తదితర బ్యాంకింగ్‌ షేర్లు నష్టపోతున్నాయి.  టాటా స్టీల్‌,  సిప్లా, జెఎస్‌డబ్ల్యు స్టీల్‌,  జీ ఎంటర్‌టైన్మెంట్‌, ఇన్ఫోసిస్‌, సన్‌టీవీ, అపోలోతోపాటు టైర్ల షేర్లు లాభాల్లో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు