స్టాక్‌మార్కెట్ల భారీ పతనం

24 Feb, 2020 09:18 IST|Sakshi

భారీ నష్టాలు, సెన్సెక్స్‌ 450  పాయింట్లు పతనం

సాక్షి, ముంబై:  దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో  సెన్సెక్స్‌ ఏకంగా 400 పాయింట్ల బలహీనంతో,  నిఫ్టీ 100  పాయింట్ల నష్టంతో ట్రేడ్‌ అవుతోంది. దీంతో నిఫ్టీ 11950 మార్క్‌ను కూడా కోల్పోయింది. దాదాపు అన్ని రంగాల్లోనూ అమ్మకాల ధోరణి కనిపిస్తోంది. మెటల్‌ షేర్లు భారీగా నష్టపోతున్నాయి. మరోవైపు టెలికాం కంపెనీలకు ఊరట లభించనుందన్న వార్తల నేపథ్యంలో టెలికాం షేర్లు, అలాగే ఐటీ షేర్లు లాభపడుతున్నాయి.హిందాల్కో, యస్‌బ్యాంకు, టాటా మోటార్స్‌, టాటా స్టీల్‌, వేదాంతా, మారుతిసుజుకి, ఐసీఐసీఐ బ్యాంకు, పీఎన్‌బీ, ఎస్‌బీఐ భారీగా నష్టపోతుండగా, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్ర, టీసీఎస్‌, హెచ్‌యూఎల్‌, సన్‌ఫార్మ లాభపడుతున్నాయి.  మరోవైపు డాలరుమారకంలో రూపాయి బలహీనంగా ట్రేడ్‌అవుతోంది. బంగారం ధరలు ఆల్‌టైం హై స్థాయికి చేరాయి. 

మరిన్ని వార్తలు