లాభాల జోరు : 39 వేల ఎగువకు సెన్సెక్స్‌

19 Jul, 2019 09:20 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు  లాభాలతో ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సంకేతాలతో, వరుస నష్టాలకు చెక్‌ చెప్పి పాజిటివ్‌గా ట్రేడ్‌ అవుతున్నాయి. సెన్సెక్స్‌ 135 పాయింట్లు  ఎగిసి 39 వేల ఎగువకు చేరగా, నిఫ్టీ 40 పాయింట్ల లాభంతో 11634 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని సెక్టార్లు లాభపడుతున్నాయి. బ్యాంకింగ్‌  షేర్లలో కొనుగోళ్లు ఊపందుకున్నాయి. ఇంకా ఎన్‌టీపీసీ, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌, టీసీఎస్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, యూపిఎల్‌, హిందాల్కో, హెచ్‌సీఎల్‌ టెక్‌ లాభపడుతున్నాయి. యస్‌బ్యాంకు, ఐవోసీ, హెచ్‌డీఎఫ్‌సీ, విప్రో, గెయిల్‌ నష్టపోతున్నవాటిల్లో ఉన్నాయి.   డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయి పాజిటివ్‌ ఆరంభాన్నిచ్చింది. గురువారం నాటి 68.96  ముగింపుతో పోలిస్తే నేడు 68.76 వద్ద ట్రేడ్‌ అవుతోంది.

మరిన్ని వార్తలు