భారీ నష్టాలు: 38 వేల దిగువకు సెన్సెక్స్‌

3 Oct, 2019 09:19 IST|Sakshi

సాక్షి, ముంబై :  అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో దేశీయ స్టాక్‌మార్కట్లు నష్టాలతో ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 309, నిఫ్టీ 96 పాయింట్లు పతనమై ట్రేడింగ్‌ను కొనసాగిస్తున్నాయి.  తద్వారా సెన్సెక్స్‌ 38వేల దిగువకు చేరింది.   నిఫ్టీ కూడా 11300 స్థాయిని కోల్పోయింది.  దాదాపు అన్ని రంగాలు నష్టపోతుండగా ముఖ్యంగా  బ్యాంకింగ్‌  షేర్లలో అమ్మకాల ఒత్తిడి నెలకొంది. యస్‌బ్యాంకు 22 శాతంగా ఎగియగా, జీ ఎంటర్‌టైన్‌  మెంట్‌,బీపీసీఎల్‌, ఐవోసీ, హీరో మోటోకార్పొ, టాటా మోటార్స్‌, ఐషర్‌ మోటార్స్‌, ఐటీసీ, బజాజ్‌ ఆటో లాభపడుతున్నాయి.  యాక్సిస్‌ బ్యాంకు, హిందాల్కో, ఇండస్‌ఇండ్‌ బ్యాంకు, కోల్‌ ఇండియా, ఎల్‌ అండ్‌టీ, సన్‌ఫార్మా, భారతి  ఎయిర్‌టెల్‌,  వేదాంతా, బ్రిటానియా, కోటక్‌ మహీంద​, డా. రెడ్డీస్‌ నష్టపోతున్నాయి. 

>
మరిన్ని వార్తలు