ఫ్లాట్‌గా స్టాక్‌మార్కెట్లు 

16 May, 2019 09:27 IST|Sakshi

సాక్షి, ముంబై :  దేశీయ స్టాక్‌మార్కెట్లు  ఫ్లాట్‌గా ప్రారంభమైనాయి. సెన్సెక్స్‌ 68 పాయింట్లు ఎగిసివద్ద, నిఫ్టీ 22 పాయింట్లు లాభంతోవద్ద ట్రేడ్‌ అయ్యాయి. కానీ వెంటనే  ఫ్లాట్‌గా  మారాయి.  సెన్సెక్స్‌ 11 పాయింట్లు లాభంతో 37135 వద్ద, నిఫ్టీ 6 పాయింట్లు లాభంతో 11162 వద్ద  కొనసాగుతున్నాయి. ఆటో, బ్యాంకింగ్‌ సెక్టార్‌లాభపడుతోంది.  టాటా గ్రూపు షేర్లు లాభపడుతున్నాయి.   ముఖ‍్యంగా టాటా కెమికల్‌,  టాటా గ్లోబల్‌, టాటా మోటార్స్‌,  ఎస్‌బ్యాంకు లాభపడుతున్నాయి. మరోవైపు లుపిన్‌ 4 శాతానికి పైగా నష్టపోతోంది.  అలాగా ఇండిగో  యాజమాన్యం వద్య విభేదాల వార్తల నేపథ్యంలో ఇండిగో నష్టపోతోంది. 

అటు ఆర్థిక వ్యవస్థ నీరసిస్తున్న సంకేతాల నేపథ్యంలో కార్లు, ఆటో విడిభాగాల దిగుమతులపై సుంకాల విధింపును వాయిదా వేసే యోచనలో  అమెరికా ప్రెసిడెంట్‌ ట్రంప్‌ ఉన్నట్లు వెలువడ్డ వార్తలు మార్కెట్లుకు సానుకూలంగా ఉన్నాయి. డాలరుమారకంలో దేశీయ కరెన్సీ రూపాయ 6 పైసలు బలపడి 70.26 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. 

మరిన్ని వార్తలు