మార్కెట్ల రీబౌండ్‌

23 Jul, 2019 14:28 IST|Sakshi

సాక్షి, ముంబై : దేశీయ స్టాక్‌మార్కెట్లు  లాభాలతో రీబౌండ్‌ అయ్యాయి. ఆరంభంలో ఫ్లాట్‌గా ఉన్నప్పటికీ, వెంటనే 100 పాయింట్లకు పైగా కోల్పోయింది. అనంతరం కొనుగోళ్లతో పుంజుకున్న  సెన్సెక్స్‌  171 పాయింట్లు ఎగిసి 38202 వద్ద, నిఫ్టీ 50 పాయింట్లు లాభపడి 11394 వద్ద కొనసాగుతున్నాయి. ఎఫ్ఎంసీజీ, ఐటీ, రియల్టీ, ఆటో రంగాల షేర్లు లాభ పడుతున్నాయి. 

యస్‌బ్యాంకు, కొటక్‌ మహీంద్రా, యూపీఎల్ తోపాటు, ఐసీఐసీఐ, యీక్సిస్‌, పవర్‌గ్రిడ్‌, టైటన్‌, ఐటీసీ, ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, ఇన్ఫోసిస్‌,  గెయిల్‌, ఐషర్ , హీరోమెటో కార్ప్‌ లాభపడుతున్నాయి. రియల్టీ కౌంటర్లలో శోభా, ఒబెరాయ్‌, బ్రిగేడ్‌, గోద్రెజ్‌ ప్రాపర్టీస్‌, మహీంద్రా లైఫ్‌, డీఎల్‌ఎఫ్‌ లాభపడుతున్నాయి.  మరోవైపు హెచ్‌డీఎఫ్‌సీ, జీ, అదానీ పోర్ట్స్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐబీ హౌసింగ్‌, బజాజ్‌ ఆటో, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎస్‌బీఐ, సిప్లా నష్టపోతున్నాయి. 
 

మరిన్ని వార్తలు