స్టాక్‌మార్కెట్‌లో ఆగని రికార్డుల జోరు

31 Jul, 2018 16:07 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు రికార్డుల పరంపరను కొనసాగిస్తున్నవరుసగా నాలుగో రోజు దేశీ స్టాక్‌ మార్కెట్లు లాభపడ్డాయి. ఆరంభంలో, మిడ్‌ సెషన్‌ నష్టాల్లో  ఉన్నప్పటికీ చివర్లో  అనూహ్యంగా పుంజుకున్న కీలక సూచీ సెన్సెక్స్‌ లాభాల సెంచరీ కొట్టింది. 112 పాయింట్లు జంప్‌ చేసి 37,606 వద్ద, నిఫ్టీ  37 పాయింట్లు పెరిగి 11,356 వద్ద  ముగిశాయి. ఇవి సరికొత్త గరిష్టాలు కావడం విశేషం.   రియల్టీ, ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ, ఆటో సెక్టార్లు పుంజుకున్నాయి.  ముఖ్యంగా దిగ్గజం కంపెనీల క్యూ1 ఫలితాలు అద్భతంగా ఉండటం  ఈక్విటీ మార్కెట్లకు మంచి ఊతమిచ్చింది. అయితే ఈ రోజు పీఎస్‌యూ బ్యాంక్స్‌ స్పల్పంగా నష్టపోయాయి.

నిన్న మార్కెట్‌ ముగిసిన తరువాత ఫలితాలు ప్రకటించిన టెక్‌ మహీంద్రా యాక్సిస్‌  బ్యాంకు లాభపడ్డాయి. వీటికితోటు మార్కెట్‌దిగ్గజాలు రిలయన్స్‌, టీసీఎస్‌  కూడా టాప్‌ విన్నర్స్‌గా ఉన్నాయి.  ఇంకా డాక్టర్‌ రెడ్డీస్‌, ఆర్‌ఐఎల్‌, హెచ్‌యూఎల్‌, అదానీ పోర్ట్స్‌, హీరోమోటో, టైటన్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, టాటా స్టీల్‌, ఎయిర్‌టెల్‌ లాభపడగా ఐబీ హౌసింగ్‌, యాక్సిస్‌, ఐషర్, హెచ్‌డీఎఫ్‌సీ, టాటా మోటార్స్‌, బీపీసీఎల్‌, ఎస్‌బీఐ, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, ఐసీఐసీఐ తదితరాలు నష్టపోయిన వాటిల్లో ఉన్నాయి.  మరోవైపు రేపటి రిజర్వ్‌ బ్యాంకు  పాలసీ రివ్యూపైనే అందరి దృష్టి నెలకొంది.


 

మరిన్ని వార్తలు