అమ్మకాల జోరు - 300 పాయింట్లు పతనం

2 Aug, 2019 09:27 IST|Sakshi

సాక్షి, ముంబై:  స్టాక్‌మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలతో మార్కెట్లో భారీగా అమ్మకాల ఒత్తిడి నెలకొంది.  సెన్సెక్స్‌ 312 పాయింట్లు నష్టపోయి 36706 వద్ద , నిఫ్టీ 100 పాయింట్లు పతనమై 10879 వద్ద  కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి.  చైనా దిగుమతులపై  అమెరికా విధించిన అదనపు సుంకాలతో మెటల్‌ షేర్లు భారీగా నష‍్టపోతున్నాయి. అలాగే బ్యాంకింగ్‌ కౌంటర్ల నష్టాలు మార్కెట్లను పడవేస్తున్నాయి.

గ్రాసిం,  బజాజ్‌ ఆటో, కోల్‌ ఇండియా  వేదాంతా, హిందాల్కో,  యాక్సిస్‌, ఐసీఐసీఐ, ఓఎన్‌జీసీ , హీరో మోటో, ఎస్‌బీఐ టాప్‌ లూజర్స్‌గా ఉన్నాయి.   కెఫే డే వరుసగా మూడో రోజు కూడా నష్టోతోంది.  ఫలితాల జోష్‌తో భారతి ఎయిర్‌టెల్‌  3 శాతానికి పైగా లాభపడుతోంది.  ఇంకా ఆసియన్‌ పెయింట్స్‌,   ఇన్ఫోసిస్‌,  పీఎన్‌బీ యస్‌బ్యాంకు లాభపడుతున్నాయి. 

మరిన్ని వార్తలు