రికార్డుల హోరు, ఆటో జోరు

17 Dec, 2019 09:26 IST|Sakshi

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు పాజిటివ్‌ ప్రారంభమైనాయి. అంతర్జాతీయ సానుకూల సందేశాలతో కీలక సూచీలు రెండూ రికార్డు స్థాయిల వద్ద కొనసాగుతున్నాయి. నిఫ్టీ బ్యాంకు, మిడ్‌ క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ ఇలా అన్నీ రంగాలు రికార్డుల స్థాయిని నమోదు చేస్తున్నాయి. సెన్సెక్స్‌ 208 పాయింట్లు ఎగిసి 41144 స్థాయికి చేరగా, నిఫ్టీ 55 పాయింట్లు లాభపడి 12109 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాల షేర్లు లాభపడుతున్నాయి. ముఖ్యంగా, బ్యాంకింగ్‌, ఆటో, రంగ షేర్లు మార్కెట్లను లీడ్‌ చేస్తున్నాయి.  మారుతి, వేదాంతా, ఐటీసీ, టాటా మోటార్స్‌, యస్‌బ్యాంకు, ఇన్ఫోసిస్‌, కోటక్‌ మహీంద్ర , ఐసీఐసీఐ, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌లాభపడుతున్నాయి. అటు డాలరు మారకంలో రూపాయి కూడా  బలంగా  ట్రేడింగ్‌ను ఆరంభించింది. 70.96 వద్ద కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు