స్మార్ట్‌ రికవరీ, బ్యాంక్స్‌ ర్యాలీ: 300 పాయింట్లు జంప్‌

26 Mar, 2018 14:09 IST|Sakshi

సాక్షి, ముంబై:  లాభనష్టాల మధ్య ఊగిసలాడిన  దేశీయ స్టాక్‌మార్కెట్లు  అనూహ్యంగా భారీ లాభాల్లో మళ్లాయి.  దాదాపు 315 పాయింట్లకుపైగా పుంజుకున్నాయి.  సెన్సెక్స్‌ 316 పాయింట్ల లాభంతో 32, 912వద్ద, నిఫ్టీ 76 పాయింట్లు ఎగిసిన 10073  వద్ద ట్రేడ్‌ అవుతున్నాయి.  ఉదయం 10వేల దిగువన  తీ‍వ్ర రెసిస్టెన్స్‌ను ఎదుర్కొన్న నిఫ్టీ పుల్‌ బ్యాక్‌ అయింది.  నిఫ్టీ బ్యాంకు కూడా 300 పాయింట‍్లకు పైగా లాభపడింది. దాదాపు అన్ని  సెక్టార్లు లాభాల్లోనే ఉన్నాయి. డెరివేటివ్‌ కౌంటర్‌ ముగింపు,  వరుస సెలవుల నేపథ్యంలో ఇన్వెస్టర్ల లాభాల స్వీకరణకు దిగినట్టు ఎనలిస్టులు చెబుతున్నారు. మరోవైపు  ఈ ఆర్థికసంవత్సరానికి  సంబందించిన స్టాక్‌మార్కెట్లకు ఇది ఆఖరు వర్కింగ్‌ డే.

మరోవైపు గ్లోబల్‌ మార్కెట్ల  భారీగా కోలుకుని సానుకూల సంకేతాలు  దేశీయ ఈక్విటీ  మార్కెట్లకు ఊతమిస్తున్నాయి.  మిడ్‌ సెషన్‌ నుంచీ ప్రభుత్వ రంగ బ్యాంకు కౌంటర్లలో కొనుగోళ్లు మరింత ఊపందుకోవడంతో మార్కెట్లు లాభాల దౌడు తీస్తున్నాయి.  ఇన్వెస్టర్ల కొనుగోళ్ళతో పీఎస్‌యూ బ్యాంక్స్‌  టాప్‌ విన్నర్‌గా ఉంది.  కెనరా బ్యాంక్‌,  బీవోబీ,ఎస్‌బీఐ, యూనియన్‌ బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, సిండికేట్‌ బ్యాంక్‌, ఇండియన్‌ బ్యాంక్‌, ఓబీసీ, అలహాబాద్‌ బ్యాంక్‌, పీఎన్‌బీ, ఆంధ్రా బ్యాంక్‌  భారీ లాభాలనార్జిస్తున్నాయి. వీటితోపాటు యస్‌బ్యాంక్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, జీ, ఎంఅండ్‌ఎం, మారుతీ, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, హెచ్‌యూఎల్‌  లాభపడుతుండగా,  గెయిల్‌, విప్రో, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ, వేదాంతా, ఇన్ఫోసిస్‌, అదానీ పోర్ట్స్‌, బీపీసీఎల్‌  నష్టపోతున్నాయి.
 

మరిన్ని వార్తలు